Articles by "Movie-News"

 

నందమూరి బాలకృష్ణ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ వచ్చే నెల 2 నుండి మొదలు కానున్నట్టు సమాచారం. 22 రోజుల పాటు జార్జియాలో జరుగనున్న ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ వచ్చే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇదంతా చూస్తుంటే అన్నిటికంటే ముందు యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసేందుకే దర్శకుడు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. మొరాకోలో జరిగిన తొలి షెడ్యూల్‌లో 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు సహా 200 గుర్రాలతో కొన్ని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన క్రిష్ హైదరాబాద్‌లో జరిగిన తర్వాతి షెడ్యూల్లోనూ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో మరి కొన్ని యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక తర్వాతి షెడ్యూల్‌ను వాటికే కేటాయించారు. ‘బాహుబలి’ తర్వాత యుద్ధ నేపథ్యంలో వస్తున్న సినిమా గనక ఆ స్థాయికి తక్కువ కాకుండా క్రిష్ జాగ్రత్త వహిస్తున్నారట. బాలయ్య వందో చిత్రంగా రానున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.


 

లైలా తన లుక్‌తో అభిమానుల గుండెల్లో హీట్ పెంచేశారు. ఇంతకీ ఈ లైలా ఎవరో తెలిసే ఉంటుంది. తెలుగు చిత్రం ‘ఒక లైలా కోసం’లో నాగచైతన్య ప్రేయసి  లైలాగా కుర్రకారు గుండెలను దోచేసిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘ముకుంద’ చిత్రంలో నటించారు. హిందీలో తొలి చిత్రం ‘మొహంజదారో’ విడుదల కాక ముందే ఆ చిత్రంలోని లుక్‌తో బాలీవుడ్‌ను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా...? ఒకే ఒక్క యాడ్‌తోనే ఆమె ఈ బంపర్ ఆఫర్ కొట్టేశారు.

సినిమాల్లోకి రాకముందు పూజ చే సిన యాడ్ ‘మొహంజదారో’ టీమ్ దృష్టిలో పడింది. అంతే.. ఆ భారీ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ చాన్స్ వచ్చేసింది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.హృతిక్ ప్రేయసి చానీగా పూజ ఇందులో నటిస్తున్నారు.  గురువారం విడుదల చేసిన చానీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ‘చానీ.. లుకింగ్ సో చార్మింగ్’ అని పూజాని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకుంటున్నారు.

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది.

అయితే ఈసినిమా ప్రారంభం అయిన సమయంలో హుషారు అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నట్టుగా తెలిపారు. అది ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామన్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్ లో కడప కింగ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు.

అయితే ఇదే పవన్ సినిమా టైటిల్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లా తెల్ల బట్టల్లో కనిపించటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. నిజంగానే పవన్ సినిమా టైటిల్ కడప కింగా కాదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఒక్క అమ్మాయి తప్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. తొలిసారిగా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు సందీప్. బుధవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజునే యాక్షన్ సీన్స్ షూటింగ్ ప్రారంభించగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సందీప్ తలకు బలమైన గాయం తగలడంతో యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన పై స్పందించిన హీరో సందీప్ కిషన్ 'ఇప్పుడు బాగానే ఉంది. కొన్ని కుట్లు పడ్డాయి. కృష్ణవంశీ గారి సెట్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ సీన్ చాలా బాగా వచ్చినందకు ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.

 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి హీరో ఎవరు? దిల్‌ రాజు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో నటించే గోల్డెన్ చాన్స్ ఎవరికి దక్కుతుంది? ప్రస్తుతం ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. 'అ.. ఆ' సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌ను హీరోగా తీసుకోవచ్చన్నది టాలీవుడ్ టాక్. ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేశ్ బాబులతో రెండేసి సార్లు పనిచేసిన ఈ స్టార్ డైరెక్టర్.. ఈసారి వాళ్లు కాక మరో కొత్త హీరోతో చేయాలని భావిస్తున్నాడట. అందుకే తాను ఇప్పటివరకు పనిచేయని చెర్రీ లేదా తారక్‌లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రామ్‌చరణ్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్ 'ధ్రువ'లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేస్తున్నాడు. త్రివిక్రమ్ తన కొత్త సినిమా కథ చెప్పగానే ఎన్టీఆర్ బాగా థ్రిల్లైపోయి.. వెంటనే సరేనన్నాడని కూడా వినిపిస్తోంది. కొన్ని వారాల్లోనే హీరో ఎవరన్నది ఫైనలైజ్ అవుతుందని, ఇక వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.




Published on Jun 12, 2016
'దేవదాస్' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యి ఆ తరువాత 'పోకిరి' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇలియానా. ఆ తరువాత వరుసపెట్టి స్టార్ హీరోల పక్కన నటించడమే కాకుండా టాలీవుడ్ లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా రికార్డు సృష్టించింది. అయితే ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి మఖాం మార్చేసింది. అయితే అక్కడ మంచి మంచి సినిమాలు చేసినా అమ్మడుకి సరైన అవకాశాలు రాలేదు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఒక చారిటీ ఫంక్షన్ కి ముఖ్యఅతిధిగా వెళ్ళింది.

అయితే లోపలి వెళ్ళేటప్పుడు ఆమె షర్టు విప్పేసి నడుముకి కట్టుకుని వెళ్ళింది. ఇది చూసిన వారు ఇలియానా ని కళ్ళార్పకుండా చూసారు. ఆ డ్రెస్ లో ఇలియానా ఎంతో సెక్సీగా ఉంది. మొత్తం మీద తన మతిపోయే ఫిగర్ తో మరోసారి అందరినీ కట్టి పడేసింది. ఇలియానా ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన 'రుస్తుం' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో టూ పీస్ బికినీ వేసి అందరినీ పిచ్చెక్కించబోతుంది. అంతే కాదు ఇందులో విపరీతమైన హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయట. అవకాశాలు కోసం ఇలియానా ఇంక అందాల ఆరబోతకు మరింత రెచ్చిపోయి గేట్లు ఎత్తేసిందని బాలీవుడ్ టాక్..


బ‌న్నీమెగా కాంపౌండ్ నుంచి ఒక‌డిగా వ‌చ్చి..నేడు టాలీవుడ్ కే మోస్ట్ ప్రామినెంట్ హీరోగా మారిపోయాడు.గంగోత్రితో మొద‌లైన బ‌న్నీ ప్రయాణం టాలీవుడ్ కు స‌రైన హీరోలా త‌న‌ను తాను మ‌లుచుకున్న తీరు నిజంగా అద్భుతం. అది ఆహార్యం కావ‌చ్చు..త‌న ఆలోచ‌న తీరు కావ‌చ్చు..వేటిక‌వే ప్రత్యేకం.
బ‌న్నీకే ఎందుకా అవ‌కాశం:
*
మ‌రో ఏ హీరోకు లేన‌టువంటి స‌క్సెస్ రేట్ బ‌న్నీకి ఉంది.
* ఇండియాలో హృతిక్ రోష‌న్ తరువాత బెస్ట్ డ్యాన్సర్ గా గుర్తింపుతో పాటు టాప్ కొరియోగ్రఫర్స్ బెస్ట్  ఛాయిస్ గా నిలిచాడు.
* అంతేకాకుండా మ‌ళ‌యాలంలో అక్కడి స్టార్ హీరోల‌కు స‌మానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బ‌న్నీకుంది.
 మల్లూ అర్జున్ గా అక్కడి వారంద‌రికీ చేరువ‌య్యాడు.
ఇప్పటికే త‌మిళంలోకి డ‌బ్ అయిన కొన్ని చిత్రాల‌తో కోలీవుడ్ లో కూడ బ‌న్నీ మెల్లగా పాగా వేశాడు. 
* త‌న త‌దుప‌రి చిత్రం హీరో సూర్యను డైరెర్ట్ చేసిన విక్రమ్ కె.కుమార్ కు ఛాన్స్ ఇచ్చిన‌ట్లు టాలీవుడ్  స‌మాచారం.
*
ఆ త‌రువాత త‌మిళ ద‌ర్శకుడు లింగుస్వామి తో తెలుగు,త‌మిళంలో నేరుగా ఒక సినిమా ప్లాన్  చేస్తున్నట్లు ఇన్ఫర్మేష‌న్.



 

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ల‌క్ష‌ణాల‌న్నీ మ‌న‌వడు జూనియ‌ర్ ఎన్టీఆర్ లో క‌నిపిస్తున్నాయ‌ని అంతా భావిస్తుంటారు. న‌ట‌న విష‌యంలోనూ తాత త‌ర్వాత మ‌న‌వ‌డు జూనియ‌ర్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. తాత రూపాన్నే పుణికి పుచ్చుకున్నాడ‌ని తార‌క్ ను చూసిన వాళ్లంతా అభివ‌ర్ణిస్తుంటారు. నేటి త‌రం నంద‌మూరి వంశం హీరోల్లో ఫామ్ లో ఉన్న ఎకైక స్టార్ కూడా జూనియ‌ర్ ఎన్టీఆరే. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ ను మాత్రం సీనియ‌ర్ ఎన్టీఆర్ తో అస్స‌లు పోల్చ‌వ‌ద్ద‌ని ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ల‌క్ష్మీ పార్వ‌తి ఈ విధంగా స్పందించారు.

ఎన్టీఆర్ కిజూనియ‌ర్ ఎన్టీఆర్ కి పోలికా? ఇద్ద‌రినీ ప‌క్క‌న‌బెట్టి చూస్తే వ్య‌త్యాసం ఏంట‌న్న‌ది క్లియ‌ర్ గా తెలుస్తుంది. ఇద్ద‌రికీ హ‌స్తిమ‌శ‌కాంత‌రం. సీనియ‌ర్ ఆజాను బాహుడైతేజూనియ‌ర్ అర‌జాన బాహుడు. ఆయ‌న అంద‌మైన రూపం ఆ ఫ్యామిలీలో ఎవ‌రికీ రాలేదు. న‌ట‌న, రూపం విష‌యంలో ఆయ‌న‌కు సాటిలేరు. ఈ విష‌యంలో ఎన్టీఆర్ కు వార‌సులే లేర‌ని వ్యాఖ్యానించారు


ఇద్దరు టాప్ హీరోలతో ఒకేసారి కలిసి పనిచేయటం ఎవరికైనా అరుదైన అవకాశమే. అలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు కోలీవుడు నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. దర్శకుడిగా టాలీవుడ్, కోలీవుడ్ లలో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు సూర్య. తరువాత తమిళ ఇండస్ట్రీలో హీరోగా మారి మంచి విజయాలు సాధించాడు. కేవలం హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే కొంతకాలంగా తమిళనాట సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఎస్ జె సూర్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూనే మరో తెలుగు స్టార్ హీరో మహేష్ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ కొట్టేశాడు.

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఒకేసారి ఇలా ఇద్దరు టాప్ స్టార్స్ తో కలిసి పనిచేసే అవకాశం రావటంపై సూర్య ఆనందంగా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.



తేజాబ్ లాంటి సినిమాలతో ఒకప్పుడు అగ్రస్థానానికి వెళ్లిన బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగొందుతుండగా, ఇప్పుడు ఆయన కొడుకు హర్షవర్ధన్ కపూర్ కూడా హీరోగా వస్తున్నాడు. అతడితో పాటు కొత్త హీరోయిన్ సయామీ ఖేర్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా మిర్జియా. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తీస్తున్న ఈ సినిమా మొదటి టీజర్ ట్రైలర్ బుధవారం  విడుదలైంది.




ఇందులో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథకు సంబంధించిన కొన్ని చిన్నిచిన్న ఘటనలు కనిపిస్తాయి. చిన్నతనంలో సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఎలా వెళ్తాడో.. పెద్దయ్యాక బైక్ మీద కూడా అచ్చం అలాగే వెళ్లడం లాంటి సీక్వెన్సులు ఈ 1.40 నిమిషాల టీజర్‌లో ఉన్నాయి. దీంతోపాటు తుపాకుల మోతలు.. గుర్రం మీద హీరో వచ్చే జానపద సీన్లు కూడా కనిపిస్తాయి. అక్టోబర్ 7వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో ఇంకా ఓంపురి, ఆర్ట్ మాలిక్, కేకే రైనా, అనుజ్ చౌదరి లాంటి వాళ్లు నటిస్తున్నారు. మీర్జా సాహిబా అనే పంజాబీ జానపద చిత్రం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

 

ఒక్క దక్షిణ భారతీయ సినిమానే కాదు యావత్ ప్రపంచంలోని రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఆశగా ఎదురు చూస్తున్న వేడుకలో ఒకటి ఈ నెల 12న బ్రహ్మాండంగా జరగనుంది. అదే కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం. సూపర్‌స్టార్ చాలా గ్యాప్ తరువాత గ్యాంగ్‌స్టర్‌గా నటించిన చిత్రం కబాలి. నటి రాధికాఆప్తే నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్న చిత్రం ఇది. కబాలి చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే చిత్ర టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక వ్యాపార పరంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది కబాలి. సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియోను ఈ నెల 12న స్థానిక వైఎంసీ మైదానంలో గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో విహార యాత్రలో ఉన్న మన సూపర్‌స్టార్ ఆ సమయానికి చెన్నై చేరుకుంటారని సమాచారం. ఇకపోతే రజనీకాంత్ అభిమానులకు మరో పర్వదినం ఏమిటంటే జూలై ఒకటో తేదీన కబాలి చిత్రం విడుదలవుతుందని ఇటీవల ఆ చిత్ర దర్శకుడు రంజిత్ వెల్లడించారు.



చిత్రం : అ ఆ
నటినటులు: నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, నరేష్, నదియా, పొసాని, అనన్య, అవసరాల తదీతరులు
డైరెక్టర్ : త్రివిక్రం శ్రీనివాస్
నిర్మాత: రాధా కృష్ణన్
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె. మెయెర్
బ్యానర్: హారికా & హాసినీ క్రియేషన్స్


                                                                                                                                    రేటింగ్‌ : 3.35/5
స్టోరీ:-

వ్యాపారవేత్త మహాలక్ష్మి (నదియా) ఒక ధనిక వ్యక్తిని పెళ్ళాడమని కూతురు అనసూయ (సమంత) ను బలవంతపెడుతుంటుంది. అనసూయ, తన అశక్తుడైన తండ్రి రామలింగం(నరేష్) సహాయంతో, తల్లికి తెలియకుండా, తండ్రి సూచించిన గ్రామంలో ఉండే తన అత్త ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళే ముందే తన బావ ఆనంద్ విహారి (నితిన్) ని కలుసుకుంటుంది.
అనసూయ బావ ఆనంద్ మీద మనసు పడుతుండగానే, ఆనంద వివాహం ఇప్పటికే, కుటుంబం డబ్బు రుణపడి ఉండటం చేత, గ్రామ ధనవంతుడు పల్లం వెంకన్న (రావు రమేష్) కుమార్తెతో నిశ్చయించబడిందని తెలుసుకుంటుంది. అనసూయకు ఆనంద్ సోదరి భానుమతి (అనన్య) మంచి స్నేహితురాలు అవుతుంది.
తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, తను ఆనంద్ ని ఇష్టపడుతున్నట్లు అనసూయకు అర్థమవుతుంది. కానీ వారి కుటుంబాల మధ్య ఉన్న వివాదం గురించితెలుసుకుంటుంది. అనసూయ తల్లి ఆమె సోదరుడు మరియు ఆనంద్ తండ్రి వద్ద నుండితీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోవడం వలన ఆనంద్ తండ్రి ఆత్మహత్యచేసుకున్న విషయం తనకు తెలుస్తుంది. అంతలో మహాలక్ష్మి అనసూయకు చుసినసంబంధాన్ని మళ్ళీ చక్కబెడుతుంది. వెంకన్న తన కుమారుడి (అజయ్) సహాయంతో ఆనంద్ను తన కుమార్తెకిచ్చి త్వరగా వివాహం చేయాలనీ ప్రయత్నిస్తుండగా, అనసూయమరియు ఆనంద్ ఎలా కలుస్తారు, వారి కుటుంబాలను ఎలా కలుపుతారనేదే మిగతా కథ.
బలాలు
. త్రివిక్రమ్ మార్క్ వినోదం
. మాటలు
. సమంత.. నితిన్
. ఛాయాగ్రహణం
. సంగీతం
బలహీనతలు
– సాధారణమైన కథ
– కథలో వేగం లేకపోవడం
చివరిగా: అఆ.. అనసూయ.. ఆనంద ప్రేమకథ

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget