మణిరత్నం సినిమాలో అదితీ రావు హైదరీ
మలయాళ చిత్రం ‘ప్రజాపతి’ (2006) సినిమాతో తెరంగేట్రం చేసిన అదితీ రావు హైదరీ అటుపై బాలీవుడ్ పయనమై ‘రాక్‌స్టార్’, ‘వజీర్’, ‘ఫితూర్’ తదితర సినిమాలతో నటిగా చక్కటి గుర్తింపు తెచ్చకుంది. తాజాగా ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం సినిమాలో అవకాశం అందుకుందట ఈ హైదరాబాదీ. ‘ఓకే బంగారం’ తర్వాత కార్తి - మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి సరసన నటించేందుకు పలువురు భామల పేర్లు పరిశీలనకు వచ్చినా కడకు ఈ అవకాశం అదితిని వరించిందట. దీంతో హీరోయిన్ల వేటకు తెరపడినట్టే. జూన్ మొదటివారంలో సినిమా షూటింగ్ మొదలవనుంది.
Javascript DisablePlease Enable Javascript To See All Widget
Post a Comment