ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘బాఘీ’లో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకొన్నారు. తెలుగులోనూ అలాంటి పాత్రలు పోషించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదంటున్నారాయన. మంగళవారం హైదరాబాద్‌లో సుధీర్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ‘‘బాఘీలో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అవకాశాలూ వస్తున్నాయి. తెలుగులోనూ విలన్‌గా నటించడానికి నేను సిద్ధమే’’ అన్నారు. త్వరలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో సుధీర్ కథానాయకుడిగా నటించనున్నారు. ఆ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘నేను బాడ్మింటన్ క్రీడాకారుణ్ని. కాబట్టి గోపీచంద్ పాత్రలో నటించడం నాకు సులభమే. పైగా పుల్లెల గోపీచంద్ జీవితాన్ని దగ్గర్నుంచి చూశా. ఆయన వ్యక్తిత్వం, జీవిత ప్రయాణం బాగా తెలుసు. ‘భలే మంచి రోజు’కు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీరాంరెడ్డి ఓ కథ చెప్పారు. అది బాగా నచ్చింది. త్వరలోనే దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తామ’’న్నారు.
Post a Comment