సావిత్రి :సినిమా రివ్యూ



రివ్యూ: సావిత్రి
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: విజన్‌ ఫిలిం మేకర్స్‌
తారాగణం: నారా రోహిత్‌, నందిత, మురళి శర్మ, అజయ్‌, ధన్య బాలకృష్ణ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, సత్య, రవిబాబు, జీవా, మధునందన్‌, శ్రీముఖి తదితరులు
మాటలు: కృష్ణ చైతన్య
సంగీతం: శ్రవణ్‌
కూర్పు: గౌతమ్‌ నెరుసు
ఛాయాగ్రహణం: ఏ. వసంత్‌
నిర్మాత: డా|| వి.బి. రాజేంద్రప్రసాద్‌
కథ, కథనం, దర్శకత్వం: పవన్‌ సాదినేని
విడుదల తేదీ: ఏప్రిల్‌ 01, 2016

చిత్ర కథ

రిషి (నారా రోహిత్) ఓ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ గాయ్.. డాక్టర్ చదివిన తను సరదా జీవితాన్ని గడుపుతుంటాడు. తను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాన్ని వెతికే ఈ హీరో కాస్త అల్లరి చిల్లరగా ఉంటాడు. సినిమా ఓ పెళ్లితో మొదలవుతుంది. అదే టైం లో సావిత్రి జన్మిస్తుంది. మొదట పుట్టిన దానికి తల్లిగారి తరపున పేరు పెట్టారని ఈసారి పుట్టబోయే బిడ్డకు తన తల్లి పేరు పెట్టాలని అనుకుంటాడు దొరబాబు (మురళి శర్మ). అనుకున్నట్టుగానే అమ్మాయి పుట్టడం సావిత్రి అని నామకరణం చేయడం జరుగుతుంది.

ఇక అదే సమయంలో దొరబాబు చెల్లిని చేసుకోవాలని భీష్మా రావు (రవి బాబు) ప్రయత్నిస్తాడు. కాని కృష్ణ (అజయ్) తనకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఆ తర్వాత కథ 20 సంవత్సరాల ఫాస్ట్ ఫార్వార్డ్ అవుతుంది. సావిత్రి (నందిత) చలాకీ గల పిల్ల చిన్నప్పటి నుండి తనకు పెళ్లి మీద ఓ మోజు.. తనని పెళ్లి కూతురిగా ఎప్పుడు చేస్తారా అని చూస్తుంటుంది. ఇక తన అక్క గాయత్రి (ధన్య బాలకృష్ణ) పెళ్లి ఫిక్స్ అవ్వగా దాన్ని కాదనుకుని వెళ్లిపోవడంతో బాబాయ్ కృష్ణకు ఫోన్ చేసి ఆమెను మరళా ఇంటికి రప్పించి ఇంటి పరువు కాపాడేలా చేస్తుంది. అయితే రిషి అసలు సావిత్రి జీవితంలోకి ఎలా వచ్చాడు..? పెళ్లి పెళ్లి అని కలవరించే సావిత్రికి పెళ్లి జరిగిందా..? లేదా..? రిషికు దొరబాబు ఫ్యామిలీకు ఉన్న సంబంధం ఏంటి..? తమ్ముడు కృష్ణ గురించి దొరబాబు తెలుసుకున్న నిజం ఏంటి..?  కథలో ఉన్న ట్విస్ట్ లు..

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
ఎప్పుడు సీరియస్ క్యారెక్టర్ లలో కనిపిస్తూ వచ్చిన నారా రోహిత్ ఈ చిత్రం లో ఫుల్ కామెడీ క్యారెక్టర్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల ఫై మోసాడు . ఇక నందిత సావిత్రిగా అమాయ‌క‌త్వం, చిలిపిత‌నం, అందం ఇలా అన్ని కలబోసి ఆకట్టుకుంది.
ఇక దొరబాబు పాత్రలో మురళి శర్మబాగానే చేశాడు. తన తమ్ముడు కృష్ణగా అజయ్ మరోసారి తన నటన ఏంటో చూపించాడు. చేసింది తక్కువ స్కోప్ ఉన్న పాత్రే అయినా సినిమాను నడిపించేది ఈ పాత్రే. ఇక కామెడీ విషయానికి వస్తే మరోసారి షకలక శంకర్ , ప్రభాస్ శ్రీను నవ్వులు పోయించారు
చివరిగా :
కథ లో కొత్తదనం లేకపోవడం , అక్కడక్కడ కామెడీ ని జోడించి సినిమాను పూర్తి చేసాడు..ఇక క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 

Labels:

Post a Comment

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget